చిరుధాన్యాల రొట్టెల తయారీ ద్వారా నాతోపాటు మరో ఆరుగురు మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.300 చొప్పున కూలి చెల్లిస్తున్నాం. సాధారణంగా మహిళలకు నిరంతర ఉపాధి లభించడం కష్టంగా ఉంటుంది. ఈ రొట్టెల యూనిట్ మాత్రం మాకు క్రమం తప్పకుండా పని, ఆదాయాన్ని అందిస్తోంది. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ యూనిట్ ఎంతో దోహదపడుతోంది. రొట్టెలకు డిమాండ్ పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉత్పత్తిని మరింత పెంచగలిగితే భవిష్యత్‌లో ఇంకొంతమంది మహిళలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. అధికారుల సహకారంతో ప్రస్తుతం యూనిట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. – వన్పలి రాఘవేంద్రమ్మ, మిల్లెట్ యూనిట్ నిర్వాహకురాలు
●


