శాంతినగర్‌లో పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

శాంతినగర్‌లో పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Aug 9 2026 8:47 AM | Updated on Aug 9 2026 8:47 AM

రాజోళి: శాంతినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిదిలో 14 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పట్టణంలోని బృందావన కాలనీలో గల గోగినేని సత్యనారాయణ ఇంటి ఎదుట గల రేకుల షెడ్‌లో బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం అందడంతో దాడి చేసి, ఎలాంటి అనుమతులు లేని 14 క్వింటాళ్ల బియ్యం గుర్తించామన్నారు. విచారణ చేయగా.. తెలుగు భాస్కర్‌, వడ్డె గోపిచంద్‌ వడ్డేపల్లి, చుట్టు పక్కల గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి, వాటిని కర్ణాటకలోని రాయిచూర్‌, ఇతర పట్టణాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

అచ్చంపేట రూరల్‌: మండలంలోని పలకపల్లి నుంచి అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అచ్చంపేట పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పల్కపల్లి నుంచి అచ్చంపేట ప్రధాన రహదారిలో కాపు కాచారు. ఓ బొలెరో వాహనం అనుమానస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో 32 ప్లాస్టిక్‌ బ్యాగుల్లో 15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. ఆ వాహన డ్రైవర్‌, ఓనర్‌ తిక్కల శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ హేమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement