నవాబుపేట: తమ పిల్లలు రాత్రిళ్లు అదోలా ఉంటున్నారు.. మద్యం తాగోస్తున్నారనుకున్నాం... కానీ తాజాగా పోలీసులు జాగిలాలతో డ్రగ్స్ కోసం సోదాలు చేస్తుంటే మండలంలో గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగం జరుగుతుందెమోనని యువత తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో తాజాగా పోలీసులు డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో సోదాలు సైతం ప్రత్యేకంగా అనుమానాలకు తావిస్తున్నాయి.
ఆదివారం సంతే టార్గెటా..
ఆదివారం మండల కేంద్రంలో జరిగే సంతకు వేలాది మంది ప్రజలు వస్తుంటారు. దీంతో సంతను టార్గెట్ చేసుకుని సందట్లో సడేమియా అన్నట్లు గంజాయి విక్రయాలు చేస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో మత్తు పదార్థాల అన్వేషణలో భాగంగా డాగ్‌స్కాడ్ ప్రత్యేక తనిఖీలు చేసింది. నిఘా విభాగం సమాచారం మేరకు తనిఖీలు జరిగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
పోలీసుల సోదాలతో మరింత ఆందోళన
డ్రగ్స్ రహిత సమాజం కోసం..
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. డ్రగ్సను పట్టణాల నుంచి పల్లెలకు పాకకుండా వాటిని కట్టడి చేయాలన్నా ఉద్దేశంతో ప్రత్యేక డాగ్ స్కాడ్ తనిఖీలు చేపట్టాం. ఎస్పీ ఆదేశాలతో డ్రగ్స్‌ను పసిగట్టే రుద్రా అనే స్నిపర్ డాగ్‌ను రంగంలోకి దించామని ఇక సోదాలు నిరంతరం కొనసాగిస్తునే ఉంటాం. – నరేందర్, ఎస్‌ఐ, నవాబుపేట


