దేశంలో సమగ్రమైన విద్యావిధానం ఉండాలి | - | Sakshi
Sakshi News home page

దేశంలో సమగ్రమైన విద్యావిధానం ఉండాలి

Aug 1 2026 12:46 AM | Updated on Aug 1 2026 12:46 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: విద్యార్థులందరికీ ఉపయోగపడేలా దేశంలో సమగ్రమైన విధ్యావిధానం ఉండాలని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు. జవహర్‌ బాల్‌ మంచ్‌ జిల్లా చైర్మన్‌ ఎన్‌.సుదర్శన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్‌ కళాశాలలో ఛాత్రోంకి గూంజ్‌ (విద్యార్థుల గళం) సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల్‌ మాట్లాడుతూ సమాజంలోని సమస్యలపై ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. ప్రశ్నించకుండా ఉంటే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం కూడా నేర్చుకోవాలన్నారు. మరో ముఖ్య అతిథి డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వారి గొంతుకను ప్రభుత్వానికి వినిపించేందుకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జేబీఎం జిల్లా కన్వీనర్‌ సుదర్శన్‌ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో జేబీఎం ఆధ్వర్యంలో ఛాత్రోంకి గూంజ్‌ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర అక్తర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్‌గౌడ్‌, మధుసూదన్‌రెడ్డి, కార్పొరేటర్‌ ఉమర్‌ కొత్వాల్‌, వాగ్దేవి కళాశాల డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి, హెచ్‌ఓడీ షాకీర్‌, జేబీఎం కన్వీనర్లు ప్రసాద్‌, కిషోర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

టీజీఎంఎఫ్‌సీ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement