ఉపాధి సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతినెల క్రమం తప్పకుండా వేతనాలివ్వాలి. గతేడాది సీఎం రేవంత్‌రెడ్డి పేస్కేల్ అమలు చేస్తామని చెప్పారు. కానీ నేటికీ అమలు చేయలేదు. ఇప్పటికై నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే సమ్మెబాట తప్పదు.
– రాజశేఖర్‌రెడ్డి,
వీబీజీ రాంజీ, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్
రెగ్యులర్ లేదా సెర్ప్ ఉద్యోగుల మాదిరిగా టైం స్కేల్ ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఒకే కేడర్‌లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నా.. అంతే జీతంతో పని చేయడం కష్టంగా ఉంది. కిందిస్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారి కుంటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.
– విజయ్‌భాస్కర్, జేఏసీ కో చైర్మన్
2024 ఫిబ్రవరి 2న ఈజీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లిలో ఉపాధి హామీ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన ఆ హామీని నిలబెట్టుకోవాలి. 3 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. సకాలంలో వేతనాలు చెల్లించాలి. మా డిమాండ్ పరిష్కరించాలి.
–ఎం.శాంతికుమార్,
జిల్లా జేఏసీ ప్రచార కార్యదర్శి
●


