పురుగు మందులు.. సింథటిక్‌ పైరెథ్రాయిడ్స్‌ | - | Sakshi
Sakshi News home page

పురుగు మందులు.. సింథటిక్‌ పైరెథ్రాయిడ్స్‌

Jul 25 2026 12:53 AM | Updated on Jul 25 2026 12:53 AM

అలంపూర్‌ : పంట సాగులో రైతులు పురుగుల మందు వినియోగించడం సర్వసాధారణం. ఈ పురుగుల మందులు పొడి రూపంలోనూ, ద్రవ రూపంలోనూ, గుళికల రూపంలోనూ, టాబ్లెట్ల రూపంలో లభ్యమవుతుంటాయి. వీటిని రసాయనికంగా నాలుగు రకాలుగా విభజించవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు వివరించారు.

ఆర్గానోక్లోరిన్‌ పురుగుల మందులు : బీ.హెచ్‌సీ, డీడీటీ, ఎండోసల్ఫార్‌, డైకోఫాల్‌, టాక్సోఫిన్‌, ఆల్‌డ్రిల్‌, క్లోరిడేన్‌, హెప్టాక్లోర్‌, డ్రై ఆల్ట్రిన్‌ మొదలైనవి. ఇవి ముఖ్యంగా కార్బన్‌ ఉదజని, క్లోరిన్‌, కలిగిన రసాయనాలు.

ఆర్గానో ఫాస్కరస్‌ పురుగుల మందులు : మాలధియాన్‌, డీడీవిపీ, ఫాస్పోమిడాన్‌, మోనోక్రోటోఫాస్‌, క్లోర్‌ఫైరిఫాస్‌, ఫోరేట్‌, రోగార్‌, ఫాసలోన్‌, ట్రయజోఫాన్‌, అసిఫేట్‌ మొదలైనవి. ఇవి కార్బన్‌, ఉదజని, భాస్వర సంబందిత రసాయనాలు.

కార్పొమేట్‌ పురుగుల మందులు : ఆల్‌ డికార్బ్‌, కార్బోఫ్యూరాన్‌, కార్బరిల్‌, ప్రొపక్సర్‌ మొదలైనవి. ఇవి కార్బానిక్‌ ఆమ్ల ఆధారిత రసాయనాలు.

సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ మందులు : సైపర్‌మెత్రిన్‌, డెకామెత్రిన్‌, ఫైన్‌వల్‌రేట్‌, పెర్‌మెత్రిన్‌. ఇవి చామంతి జాతీ మొక్కల్లో ఉండే పైరెత్రమ్‌ అనే విషపూర్తి పదార్థాన్ని గుర్తించి దానికి అనుగుణమైన రసాయనాన్ని తయారు చేస్తారు.

సింథటిక్‌ పైరెథ్రాయిడ్స్‌ : 1970 దశకంలో వచ్చిన సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ సస్యరక్షణల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ప్రత్యేకించి పత్తిపై కాయ తొలి చే పురుగులను సమర్థవంతంగా అరికట్టగలిగాయి. వీటి వాడకం వలన ఉపయోగాలతోపాటు అనర్థాలు కూడ కలిగాయి. దీనికి తోడు రైతులు విచక్షణరహితంగా వాడడం వలన కొత్త సమస్యలు వచ్చాయి.

ఉపయోగాలు : ● ఆనవాయితీగా వాడే ఎండో సల్ఫాన్‌, పారథియాన్‌, మోనోక్రోటోఫాస్‌ మొదలైన మందుల కన్న కీటక సంహారక శక్తి ఎక్కువ.

● ప్రత్యేకించి పత్తిపై కాయతొలిచే అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా స్మర్శ చేతనే నాశనం చేస్తోంది.

● మందు చల్లిన రెండు వారాల వరకు ప్రభావం ఉంటుంది. అందు వలన తక్కువ వ్యవధిలో మందులు చల్లాల్సిన అవసరం ఉండదు.

పాడి–పంట

చెడు గుణాలు :

ఈ మందులు రసాన్ని పీల్చే పురుగులను నిర్మూలించలేవు. పైగా ఎర్రనల్లి, తెల్ల దోమ బేడద ఎక్కువ అవుతుంది.

బంక కారడం, ఆల్టర్నేరియా, ఆకు మచ్చ తెగులు వృద్ధి చెందుతాయి.

అన్నీ పురుగుల మందుల మాదిరిగానే ఇవి కూడా సహజ శత్రువులైన బదరికలు, పరాన్న జీవులను నశింపజేస్తాయి. రెండవ తరం పురుగులు శక్తివంతమై పంటను నాశనం చేస్తాయి.

విచక్షిణ రహితంగా వాడితే కాయ తొలిచే పురుగుల్లో నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత వీటిని ఆరికట్టడం సాధ్యం కాదు.

ఇవి చేపలకు హాని కలిగిస్తాయి. పక్షులకు కొంత మేరకు హాని కలిగిస్తాయి.

ఉపయోగకరమైన కీటకాలు చనిపోతాయి. మొక్కల పెరుగుదల లోపించ వచ్చను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement