కొల్లాపూర్: రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన మానవత్వాన్ని చాటుకున్నారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్‌కు చెందిన కావలి మల్లేష్ సింగోటం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో కిందపడిపోయాడు. అటుగా వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాదానికి గురైన మల్లేష్‌ను చూసి తన కాన్వాయ్‌లో కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించారు. అయితే మల్లేష్ మద్యం మత్తులో ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ మల్లేష్‌ను సకాలంలో ఆస్పత్రికి తరలించడంపై ఆయన కుటుంబీకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


