పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఆత్మహత్య

Jul 25 2026 12:53 AM | Updated on Jul 25 2026 12:53 AM

తెలకపల్లి: పురుగు మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాలు.. మండల పరిదిలోని గౌరెడ్డిపల్లికి చెందిన అతినారపు శ్రీకాంత్‌ (24) మెకానిక్‌గా పని చేసేవాడు. ఇటీవల ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాని ఆమెనే పెళ్లి చేసుకుంటానని కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తెలకపల్లి మండల సమీపంలోని పర్వతాపూరం రోడ్డులో ఓ చెట్టుకింద పురుగు మందు తాగి చనిపోతున్నట్లు అన్నకు ఫోన్‌ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే చనిపోయి పడి ఉన్నాడు. తండ్రి అతినారాపు బంగారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement