కొల్లాపూర్ రూరల్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కొల్లాపూర్ రేంజ్ అటవీ ప్రాంతంలో నాగర్‌కర్నూల్ డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫారెస్టు అకాడమీ నుంచి వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన 54 ఫారెస్టు రేంజర్ శిక్షణ అధికారుల శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఐదు రోజులుగా సోమశిల సమీపంలోని ఎకో పార్క్‌లో వీరు శిక్షణ పొందారు. శిక్షణలో భాగంగా ప్రతి రోజు సుమారు 12 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో నడక నిర్వహిస్తు అటవీ నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పరిరక్షణ, క్షేత్రస్థాయి విధులపై ప్రత్యక్ష అనుభవం పొందినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. అలాగే కొల్లాపూర్ రేంజ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి వాటి అమలు విధానంపై అవగాహన పెంపొందించుకున్నారననారు. కార్యక్రమంలో అకాడమీ శిక్షణ అధికారి డీఎఫ్‌ఓ రేఖాభాను, అచ్చంపేట ఎఫ్‌డీఓ చంద్రశేఖర్, కొల్లాపూర్ రేంజర్ వాణికుమారి, శిక్షణ ఇన్‌చార్జి భూమా, ఎఫ్‌ఆర్‌ఓలు ఈశ్వర్, రవికిరణ్, ఎఫ్‌ఎస్‌ఓ ముజీబ్, కాశన్న, బయన్న, శ్యామ్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


