ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయం సమీపంలోని నల్లకుంట వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రా మస్తుల కథనం ప్రకారం.. నల్లకుంట వద్ద పురాతన కాలం నుంచి ఓ బండరాయిపై వినాయకుడి విగ్ర హం చెక్కి ఉంది. అక్కడ ఆనవాళ్లను బట్టి రెండు రోజుల క్రితం గుర్తుతెలియని దుండగులు రాత్రిళ్లు జేసీబీతో విగ్రహం ఉన్న బండ పరిసర ప్రాంతంలో గొయ్యి తీశారు. అందులో తేలిన బండ రాళ్లను పక్కన పడేశారు. దాంతో పాటు దీపం వెలిగించి, కుంకుమ చల్లి పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన వారి ప్రమేయంతోనే తవ్వకాలు జరిగి ఉంటాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ రమేశ్‌ను వివరణ కోరగా.. గుప్తనిధుల తవ్వకాల విషయం తన దృష్టికి రాలేదని, సంబంధిత జీపీఓతో విచారణ చే యించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
ఆలస్యంగా వెలుగులోకి..


