కొత్తకోట రూరల్: టమాట లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడి న ఘటన మండలంలోని అమడబాకుల స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి–44పై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నషీద్‌కు స్వల్ప గాయాలు కాగా.. హెల్పర్ ఖాసీఫ్ సురక్షితంగా బయటపడ్డాడు. బెంగళూరు సమీపంలోని కోలార్ నుంచి టమోటా లోడ్‌తో మధ్యప్రదేశ్‌కు బయలుదేరిన లారీ అమడబాకుల స్టేజీ సమీపానికి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే హైవే సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది గాయపడిన డ్రైవర్ నషీద్‌ను కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శివానందంగౌడ్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మార్చొద్దు
మహబూబ్‌నగర్ రూరల్: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తలలేని మొండెంలా మార్చవద్దని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు కోరారు. బుధవారం అంబేడ్కర్ కళాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు–సామాజిక న్యాయం అంశంపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు మల్లెల మా ణిక్యంరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడారు. చట్టం కింద నమోదయ్యే కేసుల్లో స్టేషన్ బెయిల్‌లు ఇవ్వకుండా చట్టాన్ని పకడ్బందీగా అమలు చే యాలని డిమాండ్ చేశా రు. సదస్సులో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్, జేఎంఐవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్, కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పరుశరాములు, జిల్లా కార్యదర్శి కుర్మయ్య పాల్గొన్నారు.


