మహబూబ్‌నగర్ క్రీడలు: ఔత్సాహిక క్రీడాకారులకు ప్రతి ఏడాది నిర్వహించే వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు క్రీడా నైపుణ్యాన్ని చాటేందుకు వేదికగా ఉపయోగపడుతున్నాయి. జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో చిన్నారులు, యువత కోసం ప్రత్యేక వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. క్రీడాకారుల కోసం నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందజేస్తారు. ఈ శిబిరాల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 10 వరకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది డీవైఎస్‌ఓ ఆధ్వర్యంలో అర్బన్ కింద దాదాపు 15 దాదాపు శిబిరాలు నిర్వహిస్తారు.
24వ తేదీ వరకు అవకాశం
ఈఏడాది జిల్లాలో నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై జిల్లా యువజన, క్రీడాశాఖ కార్యాచరణ రూపొందిస్తుంది. వివిధ క్రీడాంశాల్లో మే 1వ తేదీ 30 వరకు (నెల రోజుల పాటు) ఔత్సాహిక క్రీడాకారులకు క్రీడా శిక్షణ అందజేస్తారు. ఈ మేరకు జిల్లాలో క్రీడా శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జాతీయస్థాయి సీనియర్ క్రీడాకారులు లేదా వ్యాయామ ఉపాధ్యాయులు (పీడీ, పీఈటీ) వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తుతో పాటు క్రీడల్లో తాము సాధించిన ధ్రువపత్రాలను జిల్లాకేంద్రం మెయిన్ స్టేడియంలోని యువజన, క్రీడా కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా పంపాలి. మిగతా వివరాల కోసం 94406 56162 నంబర్‌ను సంప్రదించాలి.
జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలోసమ్మర్ క్యాంప్‌లు
మే 1వ తేదీ నుంచి
నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ
దరఖాస్తులను ఆహ్వానించిన
యువజన, క్రీడాశాఖ


