ఏడు ఎకరాలు సాగుచేశా.. | - | Sakshi
Sakshi News home page

ఏడు ఎకరాలు సాగుచేశా..

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

యాసంగిలో జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో 7 ఎకరాల్లో వరి సాగుచేశా. ప్రాజెక్టు ముందు భాగంలో ఉన్న గ్రామం కాబట్టి వారబంది విధానంలో నీటిని వదులుతున్నా సద్వినియోగం చేసుకుంటున్నా. ప్రస్తుతం పంట చేతికి రావాలంటే మరో మూడు తడులైనా నీటిని అందించాలి.

– మైను, రైతు, నందిమళ్ల

ఐదు తడులు అవసరం..

జూరాల ఎడమ కాల్వ ద్వారా వారబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీరు వదులుతున్నారు. కాల్వ వెంట ఉన్న తూములకు షట్టర్లు సరిగా లేకపోవడంతో డి–6 కాల్వకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. సాగునీరు అందుతుందనే ఆశతో 11 ఎకరాల్లో వరి సాగుచేశా. అధికారులు ఈ నెల 15 వరకే సాగునీరు వదులుతామంటున్నారు. పంట చేతికి అందాలంటే మరో 5 తడులు ఇవ్వాలి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

– దేవేంద్రం, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్‌)

ఇబ్బంది లేదు..

ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎడీడీఎల్‌ స్థాయికిపైన 1.486 టీఎంసీలు ఉండగా.. లైవ్‌లో 0.442 టీఎంసీలు ఉన్నాయి. వేసవిలో తాగునీటి కోసం అర టీఎంసీ నీళ్లు అవసరం. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపోతాయి. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు ఈ నెల 15 వరకు సాగునీటిని విడుదల చేస్తాం. – రహీముద్దీన్‌,

ఎస్‌ఈ, సాగునీటి పారుదల శాఖ

సీఎం దృష్టికి తీసుకెళ్తా..

జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను.

– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి,

ఎమ్మెల్యే, గద్వాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement