ప్రమాదం జరిగినా పరీక్ష కేంద్రానికి.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదం జరిగినా పరీక్ష కేంద్రానికి..

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

కోస్గి రూరల్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైనప్పటికీ చదువుపై పెంచుకున్న మమకారంతో పరీక్షకు హాజరయ్యాడు ఓ ఇంటర్‌ విద్యార్థి. పట్టణంలోని ప్రజ్ఞ జూనియర్‌ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కార్తీక్‌రెడ్డి ఈ నెల 21న కశాశాలలో నిర్వహించిన వీడ్కోలు సమావేశం అనంతరం బైకుపై మిత్రులతో కలిసి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ముగ్గురు మిత్రులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో పాలమూర్‌ జిల్లా గండిడ్‌ మండలంలోని రెడ్డిపల్లికి చెందిన కార్తీక్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో మూడు పరీక్షలకు హాజరుకాలేదు. శుక్రవారం జరిగిన జంతుశాస్త్రం పరీక్షకు గాయాలతోనే హాజరయ్యాడు. అధికారులు అరుబయట టేబుల్‌ ఏర్పాటు చేసి పరీక్షకు అనుమతిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement