డ్రెయినేజీలు లేక ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

డ్రెయినేజీలు లేక ఇబ్బందులు

Mar 7 2026 9:22 AM | Updated on Mar 7 2026 9:22 AM

మా ప్రాంతంలో డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో మురుగు మొత్తం మట్టి రోడ్డుపైనే పారుతోంది. దోమల బెడద తీవ్రంగా ఉంది. సాయంత్రం అయితే చాలు ఇంటి కిటికీలు మూసి వేయాల్సిన పరిస్థితి. చుట్టూ అపరిశుభ్ర వాతావరణం అలుముకుంది. ఈ సమస్యలను పరిష్కరించాలని కార్పొరేషన్‌ అధికారులతో పాటు కలెక్టరేట్‌ ప్రజావాణిలో పలుసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు.

– పి.మాధవి, మహిళా సంఘం అధ్యక్షురాలు, పద్మావతికాలనీ

దోమలతో వేగలేకపోతున్నాం..

మా కాలనీలో దోమల బెడద తీవ్రంగా ఉంది. చుట్టుపక్కల ఓపెన్‌ ప్లాట్లు చెత్తాచెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా మారాయి. సాయంత్రం కుప్పలుకుప్పలుగా దోమలు ఇంట్లోకి వస్తున్నాయి. తలుపులకు జాలీలు పెట్టుకున్నా అవసరమైనప్పుడు తెరిస్తే లోపలికి వస్తున్నాయి. నాకు ఐదేళ్లలోపు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇవి కుట్టడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.

– ప్రతిభ, గృహిణి, విఘ్నేశ్వరకాలనీ (మర్లు)

అన్ని చర్యలు తీసుకుంటున్నాం

నగరంలో దోమల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మా సిబ్బంది అన్ని డివిజన్లలో ఇంటింటికి వెళ్లి చెత్తాచెదారం ఆరుబయట వేయొద్దని సూచిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. దీనివల్ల సమస్య ఉత్పన్నమవుతోంది. మరోవైపు ఇంటి ఆవరణలోని సంప్‌లు, డ్రమ్ములలో ఎక్కువ రోజులు నీరు నిల్వ చేయొద్దు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసి నీటిని వాడుకోవాలి. అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఎలాంటి సీజనల్‌ వ్యాధులు సోకవు.

– పి.రామాంజులరెడ్డి, కమిషనర్‌, మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement