మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం హైవే పై అదు పు తప్పిన బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన ప్రదేశానికి కొంత దూరంలోనే జరిగిన ఇలాంటి ఘటన గతంలో ఏడుగురిని బలి తీసుకుంది. బస్సు, లారీ ప్రమాదానికి గురైన ప్రదేశానికి సుమారు 50 మీటర్ల దూరంలోనే 2015 జనవరి 27న ఇలాంటి ప్రమాదమే జరిగింది. మహారాష్ట్రకు చెందిన వారు బొలెరో వాహనంలో తిరుపతి నుంచి వస్తుండగా డివైడర్ మీదుగా దూసుకెళ్లిన బొలెరో పక్క రోడ్డు మీద వెళ్తున్న ఇన్నోవా కారును ఎదురుగా ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. రెండు ప్రమాదాలు కొంత దూరంలోనే చోటు చేసుకోవడం.. ఈ రెండు ప్రమాదాలు జరిగిన తీరు ఒకేలా ఉండటం నాటి ఘటన గురించి తెలిసిన వారిని కలిచి వేస్తోంది.


