కాగా.. పొన్నకల్ స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం వల్ల శుక్రవారం మధ్యాహ్నం ట్రాఫిక్‌ను కర్నూలు రోడ్డు పైకి మళ్లించారు. ఈక్రమంలో ఒకే రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లు కోమిరెడ్డిపల్లి సర్వీస్ రోడ్డు వద్ద ఎదురెదురుగా ఢీ కొన్నా యి. ఇందులో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట, అడ్డాకుల ఎస్‌ఐలు వేణు, శ్రీనివాస్‌లు సహాయక చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.


