ఫేక్‌ సర్టిఫికెట్లతో కొలువు! | - | Sakshi
Sakshi News home page

ఫేక్‌ సర్టిఫికెట్లతో కొలువు!

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

గద్వాల క్రైం: ఓ లెక్చలర్‌ నకిలీ యూనివర్సిటీలో డి గ్రీ పూర్తి చేసినట్లు ప్రభు త్వాన్ని బురిడి కొట్టించి ఒప్పంద అధ్యాపాకుడిగా అర్హత సాధించి.. చివరకు ప్రభుత్వ లెక్చలర్‌గా నియమితులై విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. విద్యాశాఖ సాంకేతిక పరిజ్ఞానం పున్యమాని ఎట్టకేలకు ఆ లెక్చలర్‌ నకిలీ ధ్రువపత్రాలతో కొలువు సాధించినట్లు ప్రభుత్వం గుర్తించి సదరు వ్యక్తిపై చీటింగ్‌ కేసు నమోదు చేసిన ఘటన గద్వాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. గద్వాల సీఐ శ్రీను కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఎం.హిమవర్ధన్‌రెడ్డి 2008లో గణితశాస్త్రంలో అర్హత సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్ల ద్వారా జగిత్యాల జిల్లా కోరుట్లలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో గణిత లెక్చలర్‌గా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో 2016లో రెగ్యులర్‌ లెక్చలర్‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశాడు. 2022లో కోరుట్లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విధులు నిర్వహించాడు. 2023లో సాధారణ బదిలీలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలం గోనుపాడులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు గణిత పాఠ్యంశాలు బోధిస్తున్నాడు. అయితే రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌ విభాగ సిబ్బంది ఎం.హిమవర్ధన్‌రెడ్డి ధ్రువపత్రాలను పునఃపరిశీలించిన క్రమంలో నకిలీ సర్టిఫికెట్లుగా గుర్తించారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులకు గణిత పాఠ్యంశాలు ఎంతమేర బోధించారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 2వ తేదీన కేసు నమోదైనప్పటికీ గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సదరు వ్యక్తి గతవారం రోజుల నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

ప్రభుత్వానికే బురిడీ కొట్టి

లెక్చలర్‌గా చలామణి

ధ్రువపత్రాల పునఃపరిశీలలో విషయం బట్టబయలు

నకిలీ లెక్చరర్‌పై చీటింగ్‌

కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement