రమణీయం.. నారసింహుడి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

రమణీయం.. నారసింహుడి రథోత్సవం

Mar 5 2026 8:31 AM | Updated on Mar 5 2026 8:31 AM

రమణీయం.. నారసింహుడి రథోత్సవం

ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లిలో కొనసాగుతున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఆలయం ఆవరణలో భక్తులు రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, నిత్యహో మం, బలిహరణం, తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం ఆలయం ఆవరణలో ట్రాక్టర్‌ రివర్స్‌ పోటీలు నిర్వహించి దాతలు పద్మారెడ్డి, నారాయణ, వెంకటేష్‌ విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉత్స వ కమిటీ చైర్మన్‌ వేముల నర్సింహారావు, ఈఓ నర్సింహులు, సర్పంచ్‌ మోహన్‌గౌడ్‌, ఉత్సవ కమిటీ సభ్యులు గణేశ్‌గౌడ్‌, స్వరూప, కృష్ణయ్య, ప్రదీప్‌ప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement