‘ఇసుకాసురులు’ | - | Sakshi
Sakshi News home page

‘ఇసుకాసురులు’

Mar 5 2026 8:31 AM | Updated on Mar 5 2026 8:31 AM

పెద్దవాగును కొల్లగొడుతున్న
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో యథేచ్ఛగా తరలింపు

అడ్డాకుల: వుూసాపేట, అడ్డాకుల మండలాల్లో విస్తరించి ఉన్న పెద్దవాగు అక్రమార్కులకు అడ్డాగా మారింది. రాత్రి అయిందంటే చాలు ఇసుకాసురులు వాగులో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేపడుతున్నారు. కొందరు కూలీలను ఏర్పాటు చేసి ఇసుకను తరలిస్తుంటే మరికొందరు యంత్రాల సాయంతో తవ్వకాలు చేస్తున్నారు. తెల్లవారుజాము వరకు వాగు నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకాసురులు ఇంతలా రెచ్చిపోతున్నా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement