రథాన్ని లాగుతున్న భక్తజనం
అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి దివ్యక్షేత్రం వద్ద స్వామి వారి రథోత్సవం రమణీయంగా సాగింది. కల్పవృక్షాలకు నెలవై దక్షిణకాశీగా వెలుగొందుతున్న ఆలయం వద్ద రథోత్సవంతో శివనామస్మరణ మార్మోగింది. మంగళవారం అర్ధరాత్రి రాత్రి కందూర్ నుంచి శ్రీరామలింగేశ్వరస్వామి వెండి ముఖం, నాగపడగలను మంగళవాయిద్యాల మధ్య బా ణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకొచ్చారు. ఆలయ పూజా రులు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధా న ఆలయంలోని శివలింగానికి అలంకరించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ప్రతిష్ఠించి.. రథం ముందు పోలు పోసి పూ జలు నిర్వహించారు. రథాంగహోమం చేసి హారతినిచ్చా రు. బుధవారం తెల్లవారుజామున అశేష భక్తజనం శివనామస్మరణ చేస్తూ మేళతాళాల ధ్వనుల మధ్య స్వామి వారి రథాన్ని ముందుకు కదిలించారు. భక్తుల భజనలు, కోలాటాలు చేస్తూ సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ మదనేశ్వర్‌రెడ్డి, అర్చకులు మణికంఠ శివాచార్య, సందీప్‌శర్మ, యాదగిరిశర్మ, రామలింగశర్మ, రేవంత్‌శర్మ, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.


