ప్రపంచ ప్రసిద్ధ మేధో యుద్ధక్రీడ చెస్
● రాష్ట్రస్థాయి జనరల్ సెక్రెటరీ బసవప్రభు
● ముగిసిన ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీలు
వనపర్తిటౌన్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మేధో యుద్ధ క్రీడ చెస్ అని చెస్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి జనరల్ సెక్రెటరీ బసవప్రభు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ముగింపు చెస్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చెస్‌తో మెదడు వ్యాయామంగా పనిచేసి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార శక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులకు ఇది మ్యాథ్స్, సైన్స్ వంటి విషయాల్లో లాజికల్ థింకింగ్‌ను మెరుగుపరుస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ.. రెండురోజుల పోటీల్లో 96మంది పాల్గొన్నారని తెలిపారు. బాలుర విభాగంలో జగదీశ్, అనీశ్ ఆదిత్యరెడ్డి, కార్తీక్, సాజిత్, బాలికల విభాగంలో ఆరాధ్య శ్రీ, మనస్వి, తన్మయి శ్రీ, మధుమిత, అభిష్ట వెండి పతకాలతోపాటు ట్రోఫీని అందుకున్నారని చెప్పారు. అనంతరం స్పాన్సర్స్ రామ్ షా హోల్‌సెల్ డీలర్ రామకృష్ణ, పూజ ఎలక్ట్రానిక్స్ వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌తో కలిసి విజేతలకు బహుమతలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో చెస్ అసోయేషన్ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్, ట్రెజరర్ టీపీ కృష్ణయ్య, గౌరవ అధ్యక్షుడు మురళీధర్, సభ్యులు గణేశ్‌కుమార్, రామ్‌ప్రసాద్, సత్యనారాయణ, నర్సింహ, రాములు, రాములుయాదవ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.


