రేపటి నుంచి సింగోటం బ్రహ్మోత్సవాలు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైయింది. ఈ నెల 15 నుంచి 21వరకు స్వామివారి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు, ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఆలయ గోపురానికి రంగులు అద్దడంతో పాటు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల డిపోల నుంచి సింగోటం గ్రామానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో అధికారులు తెలిపారు. భక్తులు స్నానాలు చేయడానికి గుండంలో వసతులు కల్పించారు. ఉత్సవాలలో భాగంగా 15 న స్వామివారికి శకటోత్సవం, పల్లకీ సేవ, 16న స్వామివారికి అశ్వవాహన సేవ, 17న గుండంలో ప్రబోత్సవం, సింహవాహన సేవ, 18న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు వేలాది మంది భక్తులు హాజరై తేరు లాగుతారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. 19న రాత్రి 7 గంటలకు స్వామివారికి తెప్సోత్సవం, డోతోత్సవం నిర్వహిస్తారు. 20న స్వామివారికి శేషవాహన, 21 రాత్రి 7 గంటలకు శ్రీవారి సముద్రంలో స్వామివారికి హంసవాహన సేవ చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. అనంతరం స్వామివారి సన్నిధిలో జాతర దాదాపు నెల రోజులు జరుగుతుంది.
లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబు
ప్రధానఘట్టం 18న రథోత్సవం
21న హంసవాహన సేవతో ముగింపు
ఏర్పాట్లు పూర్తి చేసిన దేవాదాయ శాఖ అధికారులు, ట్రస్ట్ సభ్యులు
రేపటి నుంచి సింగోటం బ్రహ్మోత్సవాలు
రేపటి నుంచి సింగోటం బ్రహ్మోత్సవాలు


