జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు హేమంత్‌కుమార్
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న జూనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు జిల్లాలోని జడ్చర్లకు చెందిన హేమంత్‌యాదవ్ ఎంపికయ్యాడు. ఇటీవల రాష్ట్రజట్టులో క్యాంప్‌నకు ఎంపికై న హేమంత్‌కుమార్ ప్రతిభచాటి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అలాగే టోర్నీలో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలుర కబడ్డీ జట్టుకు జిల్లాకు చెందిన గణేష్ మేనేజర్‌గా, టోర్నీలో రెఫరీగా ఆర్.శ్రీనివాసులు వెళ్లనున్నారు. వీరి ఎంపికపై జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు బి.శాంతికుమార్ హర్షం వ్యక్తం చేశారు. వీరిని ఎంపిక చేసినందుకు రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని వీరేశ్‌ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్‌రెడ్డిలకు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
మొక్కజొన్న
లారీ మాయం
అలంపూర్: రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కల లారీ మాయమైంది. డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని రైతులు ఆందోళన చేయడంతో ఈ సంఘటన అలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. అలంపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ 21 పాపనాశిని ఆలయాల సమీపంలోని కేంద్రం వద్ద అధికారులు రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన మూడు ధాన్యం లారీలను అలంపూర్ చౌరస్తా సమీపంలోని వీకేర్ గోదాంకు తరలించారు. అయితే ఇందులో ఒక లారీ లోడ్ వీకేర్ గోదాంకు చేరలేదు. ఏపీ 39 వీఎల్ 4269 నంబర్ గల లారీ ధాన్యాన్ని గోదాంలో అన్‌లోడ్ చేయకుండానే మాయమైంది. ఘటన జరిగి దాదాపు 20 ఇరవై రోజుల తర్వాత గుర్తించిన పీఏసీఎస్ కార్యదర్శి శ్రీనివాసులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
● గతేడాది డిసెంబర్ 21న మాయమైన లారీ
● గోదాంకు చేరకపోవడంతో విషయం బయటికి
జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు హేమంత్‌కుమార్
జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు హేమంత్‌కుమార్


