దివ్యాంగులందరిలో ఏదో ఒక ప్రతిభ
● బీజేపీ జాతీయ ఉపాఽధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ
● రూ.1.50 కోట్ల విలువైన ఉపకరణాలు పంపిణీ
మహబూబ్‌నగర్ రూరల్: దివ్యాంగుల ప్రతిఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ, మేధస్సు తప్పక కలిగి ఉంటారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లాకేంద్రంలోని స్టేట్‌హోమ్ ఆవరణలో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ సభాధ్యక్షత వహించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని మహబూబ్‌నగర్, వనపర్తి, జడ్చర్ల నియోజకవర్గాల్లో వెయ్యిమంది దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అలింకో ద్వారా రూ.1.50కోట్ల విలువైన 986 ఉపకరణాలు బ్యాటరీ ట్రై సైకిల్స్, సాధారణ ట్రై సైకిల్స్, హ్యాండ్ స్టిక్స్, హియర్ ప్యాడ్‌లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలింకో దివ్యాంగుల సాధికరతకు పనిచేస్తుందన్నారు. ఈసారి ఉపకరణాలు రానివారికి మరోసారి పంపిణీ చేపడతామని హామీ ఇచ్చారు.


