నోరూరించే పిండి వంటలు
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుచ్చేవి అరిసలు. బెల్లంతో తయారు చేసే అరిసెలు ఆరోగ్యానికి మంచిది. కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులతో అరిసెలు తయారు చేస్తారు. అదేవిధంగా బియ్యం పిండి, కొబ్బరి, నువ్వుల పిండితో బూరెలు చేస్తారు. వీటికి తయారీకి కొంతమంది పంచదార పాకాన్ని వాడుతారు. సంక్రాంతి పండుగలో అతి బలవర్ధకమైన ఆహారం నువ్వుల ఉండలు. నువ్వుల ఉండలు తినడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చు. సంక్రాంతి సంప్రదాయ వంటగా కజ్జికాయలను తయారు చేస్తారు. అలాగే నేతితో చేసిన గారెలు, పాయసం, పరమాన్నం, జంతికలు, సున్నుండలు, లడ్డూలు తయారుచేస్తారు.
నువ్వుల రొట్టెలు ప్రత్యేకం
భోగి రోజు అందరి ఇళ్లల్లోనూ నువ్వుల రొట్టెలు చేయటం ప్రత్యేకత. కొందరు బియ్యంపండి, మరికొందరు జొన్నపిండిలో నువ్వులను వేసి రొట్టెలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. చలికాలం కావటం వల్ల నువ్వులు వంటికి వేడిని అందిస్తాయని భోగి రోజున వాటిని ఆరగిస్తారు. అలాగే చిక్కుకాయ లేదా వివిధ రకాల కూరగాయలను కలిపి వండుతారు.
నోరూరించే పిండి వంటలు
నోరూరించే పిండి వంటలు
నోరూరించే పిండి వంటలు
నోరూరించే పిండి వంటలు
నోరూరించే పిండి వంటలు


