జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పదోతరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ జిలా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో డైరీని కలెక్టర్, డీఈఓ ప్రవీణ్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలన్నారు. అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సతీశ్, తాహెర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ము ఖ్యంగా గత సంవత్సరంలో పదో తరగతి మూ ల్యాంకన పారితోషికం వెంటనే విడుదల చేయాలని, మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళా ఉద్యోగ ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏఎంఓ శ్రీనివాసులు, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, డీఎస్‌ఓ షంషీర్, జీసీటీఓ అస్రాఖాద్రి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హమీద్‌అలీ, రాష్ట్ర కార్యదర్శులు ఫరీద్, శశిధర్ ఉపాధ్యక్షులు అనిల్‌కుమార్ శరణప్ప మల్లికార్జున్, శ్రీనివాసులు, కృష్ణనాయక్ పాల్గొన్నారు.


