మూడు రోజుల పండుగ
సంక్రాంతిని మూడు రోజు ల పండుగగా నిర్వహిస్తారు. మొదటి రోజు భోగి పురస్కరించుకొని పిల్లలకు ఆరో గ్యం కలిగించాలని సూర్య నారాయణను ప్రార్థిస్తూ భోగి పళ్లు వేస్తారు. రెండో రోజు సంక్రాంతి.. విశేష రీతిలో సూర్య ఆరాధన నిర్వహిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా అనేక మంది జపాలు, తర్పణాలు, హోమాలు, పితృదేవత ఆరాధనలు నిర్వహిస్తారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా శుభ కార్యాలు చేయడానికి యోగ్యమైన కొంతకాలంగా జ్యోతిష్య శాసనం తెలియజేస్తోంది. మూడో రోజు కనుమపండుగ సందర్భంగా పశువుల పూజలు నిర్వహిస్తారు.
– గొండ్యాల రాఘవేంద్రశర్మ, మహబూబ్‌నగర్


