ఐటీఐ కళాశాలలో వసతుల పరిశీలన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలలను లేబర్ ఎంప్లాయిమెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా కళాశాలల్లో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నెలకొల్పిన ఏటీసీ సెంటర్లలో ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రాల పనితీరు, వసతులను పరిశీలించారు. కళాశాలలో విద్యార్థులు తక్కువగా హాజరుకావడానికి కారణాలపై ఆరాతీశారు. బాలికల కళాశాలలో హాస్టల్ వసతి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వచ్చే వారంలో ఉమ్మడి జిల్లా స్కిల్ విజనింగ్ వర్క్‌షాప్ నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ రాజు, ప్రిన్సిపాళ్లు శాంతయ్య, గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


