యూరియాకు ప్రత్యామ్నాయం అన్వేషించాలి
బిజినేపల్లి: యూరియా కొరత, డ్రోన్ ఆధారిత వ్యవసాయం, సమీకృత వ్యవసాయం, యాంత్రీకరణ, నాణ్యమైన విత్తనం, చేపల పెంపకం తదితర వాటిపై అన్నిశాఖల సమన్వయంతో క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని దక్షిణ తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకుడు డా. ఎల్.కృష్ణ అన్నారు. సోమవారం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాసీ్త్రయ సలహాసంఘం 2025–26 సమావేశం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూరియాకు ప్రత్యామ్నాయం అన్వేషించాలని, మామిడిలో అంతర పంటగా అల్లం సాగు చేయాలని, నీటికుంటల్లో చేపల పెంపకం, చిరుధాన్యాలతో పౌష్టికాహారం తయారీ, మహిళా సంఘాలకు స్వగృహ వ్యాపారాలు వంటి వాటిపై భవిష్యత్ ఫలితాలను అద్భుతంగా సాధించాలన్నారు. కార్యక్రమంలో పాలెం కేవీకే కో–ఆర్డినేటర్ డా. శ్రీదేవి, డీఏఓ యశ్వంత్‌రావు, ఇతర శాస్త్రవేత్తలు డా. ఎం.వెంకటేశం, నర్సింహారావు, పద్మవేణి, మనోహర్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీశైలంగౌడ్, జ్ఞానశేఖర్, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
ఎతైన కొండలపై..
500 అడుగుల ఎత్తైన నల్లమల కొండలపై ఉమామహేశ్వర క్షేత్రం వెలిసింది. పురాణ ప్రసిద్ధిగాంచిన శ్రీశైల క్షేత్రంకు ఉత్తర ద్వారంగా ఉమాశక్తి పీఠంగా ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. రావణాసురుని చంపిన తదుపరి శ్రీరాముడు శ్రీశైలం ప్రదక్షిణను ఉమామహేశ్వర క్షేత్రం నుంచి ప్రారంభించినట్లు స్థల పురాణం చెప్పుతుంది. అహోబిలం, మహానంది, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాలు వెలిసిన నల్లమల ప్రాంతంలోనే ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం కొండ బాణం ఆకారంలో వంపు తిరిగి ఉండటంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెండు కొండలు ఒకదానిపై ఒకటి అమర్చినట్లు ఉండటం విశేషం. మొదటి కొండపై రెండోది 20 అడుగుల ఎత్తున ఉంటుంది. కింది కొండ విశాలంగా ఉండగా పైన ఉన్న కొండ కేవలం ఐదు అడుగుల వెడల్పు మాత్రమే ఉంది.
జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి : డీవైఎఫ్‌ఐ


