చారిత్రక ఆలయాల్లో సందర్శకులకు సౌకర్యాలు
అలంపూర్ రూరల్: హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలంపూర్‌లోని చారిత్రత్మక ఆలయాల్లో సందర్శకుల సౌకర్యాలు మెరుగుపరచడానికి సమగ్ర చర్యలు ప్రారంభించినట్లు పరిరక్షణ సహాయకుడు వెంకటయ్య తెలిపారు. అలంపూర పట్టణంలోని సంగమేశ్వర, పాపానాశీశ్వర ఆలయాల్లో జరుగుతున్న పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లో సందర్శుకుల సౌకర్యాల కోసం వృద్ధ సందర్శకులు, దివ్యాంగులకు సుభంగా చేరుకోవడానికి పాపనాశీశ్వర ఆలయంలో ర్యాంపును చేపట్టామన్నారు. ప్రాంగణంలో పర్యావరన పరిరక్షణ, మెరుగైన సౌందర్యానికి దోహదపడేందుకు రెండు ఆలయ సముదాయాల్లో ట్రీ గార్డులను ఏర్పాటు చేశామన్నారు. ఆలయం లోపల సందర్శకుల సురక్షితమైన కదలికలను నిర్ధరించడానికి మార్గాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వారసత్వ స్మారక చిహ్నాలను సంరక్షించడంలో ఏఎస్‌ఐ నిబద్ధతను ప్రతిబింభిస్తాయన్నారు. సంగమేశ్వర ఆలయంలో ఒక వివరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏఎస్‌ఐ ప్రతిపాదించినట్లు, ఇది సందర్శకులకు చారిత్రకు, సాంస్కృతిక సమాచారన్ని అందిస్తుందన్నారు. సంగేమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఒక గదిని కేటాయించడంతో జిల్లా పరిపాలన మద్దతిచ్చిన తర్వాత ఈ చొరవ అమలు చేయబడుతుందన్నారు. కొనసాగుతున్న ప్రతిపాదిత పరిణామాలు ప్రఖ్యాత అలంపూర్ ఆలయ సముదాయం వారసత్వ అవగాహన, సందర్శకుల సౌకర్యం, స్థిరమైన పరిరక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిరక్షణ సహాయకుడు వెంకటయ్య తెలిపారు.


