గ్యాస్‌పైపులీకై వ్యాపించిన మంటలు
ఆత్మకూర్: గ్యాస్ సిలీండర్ పైపు లీకేజీ కారణంగా మంటలు వ్యాపించి ఐదుగురికి గాయాలైన ఘటన సోమవారం ఆత్మకూర్ మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కత్తేపల్లికి చెందిన భారతి సోమవారం మధ్యాహ్నం సిలీండర్ స్టౌపై వంట చేస్తుంది. ఇంతలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న ఐదుగురు ఉక్కిరిబిక్కిరయ్యారు. బయటకు పరుగులు తీశారు. సిలీండర్ పైపు చాలపాతద అని ఆ పైపునకు రంధ్రాలు పడితే ప్లాస్టర్లు వేసి వాడుకుంటున్నారని అందులో భాగంగానే మంటలు చెలరేగాయని గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో భారతి, సంధ్య, లోకేశ్, లావణ్య, శావణికి గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు ‘108శ్రీలో ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఐదుగురికి గాయాలు
గ్యాస్‌పైపులీకై వ్యాపించిన మంటలు


