రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు
నారాయణపేట: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ శిఖా గోయెల్ ఆదేశాల మేరకు సోమవారం ఆర్‌వీఈఓ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీ–2 యూనిట్ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం నారాయణపేట జిల్లాలోని రెండు రైసు మిల్లులపై జిల్లా సివిల్ సప్లయ్ డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి ఆకస్మికంగా దాడులు చేపట్టారు. దామరగిద్ద మండలంలోని రెండు రైసు మిల్లుల్లో తనిఖీలు చేయగా ఆశన్‌పల్లిలో గల అన్నపూర్ణ రైస్ మిల్లులో 1,38,422 వరి ధాన్యం బస్తాలు, క్యాతన్‌పల్లిలోని శ్రీసాయిరాం ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో 23,970 బస్తాల కొరత ఉండగా.. ఈ ధాన్యం విలువ రూ.15,92,28,860 ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సదరు రైసు మిల్లుల యజమాని సత్యనారాయణరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సివిల్ సప్లయ్ డీఎం సైదులును ఆదేశించారు.


