మహిళలే కీలకం..! | - | Sakshi
Sakshi News home page

మహిళలే కీలకం..!

Jan 13 2026 7:31 AM | Updated on Jan 13 2026 7:31 AM

మహిళలే కీలకం..!

మహిళలే కీలకం..!

పురుషులతో పోలిస్తే 10,891 మంది అధికం

పురుషులు 3,03,839.. మహిళలు 3,14,730

పోలింగ్‌ కేంద్రాలు 302

మున్సిపాలిటీ/ డివిజన్లు/ పోలింగ్‌ ఓటర్లు..

కార్పొరేషన్‌ వార్డులు కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

మహబూబ్‌నగర్‌ 60 279 97,636 1,00,191 14 1,97,841

దేవరకద్ర 12 12 4,909 5,161 0 10,070

భూత్పూర్‌ 10 11 5,975 6,089 0 12,064

వనపర్తి 33 95 31,655 32,527 8 64,190

కొత్తకోట 15 30 8,822 9,370 0 18,192

పెబ్బేరు 12 24 7,076 7,257 0 14,333

అమరచింత 10 18 4,364 4,783 0 9,147

ఆత్మకూరు 10 20 5,624 6,013 0 11,637

గద్వాల 37 78 31,730 33,630 10 65,370

అయిజ 20 26 11,233 11,790 0 23,023

అలంపూర్‌ 10 20 4,681 4,940 1 9,622

వడ్డేపల్లి 10 19 5,256 5,347 1 10,604

నారాయణపేట 24 54 17,244 18,216 0 35,460

మక్తల్‌ 16 35 11,407 11,938 0 23,345

కోస్గి 16 32 10,028 10,219 1 20,248

మద్దూర్‌ 16 20 6,171 6,530 0 12,701

నాగర్‌కర్నూల్‌ 24 48 17,460 17,918 0 35,378

కల్వకుర్తి 22 44 12,975 13,048 0 26,023

కొల్లాపూర్‌ 19 38 9,593 9,763 0 19,356

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పురపాలికల ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు మరో 18 పురపాలికలకు సంబంధించి సోమవారం తుది ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జయాపజయాల్లో వారి కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌లో..

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, భూత్పూర్‌ పురపాలికల్లో మొత్తంగా పురుషుల కంటే 2,921 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో 2,409.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి పురపాలికల్లో 2,807.. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్‌, కోస్గి, మద్దూర్‌ మున్సిపాలిటీల్లో 2,053.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ పురపాలికల్లో మొత్తంగా 701 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శాతాల వారీగా గమనిస్తే గద్వాల జిల్లాలో 2.58 శాతం మంది మహిళలు అధికంగా ఉన్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 2.24 శాతం, వనపర్తిలో 2.05 శాతం, మహబూబ్‌నగర్‌లో 1.33 శాతం, చివరగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అత్యల్పంగా 0.87 శాతం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

రిజర్వేషన్ల ఖరారే

తరువాయి..

ఓటర్ల తుది జాబితా ఖరారు సోమవారం రాత్రి వరకు కొనసాగింది. దీంతో ఫొటోల వారీగా డివిజన్లు/వార్డుల ఓటర్‌ లిస్ట్‌ను మంగళవారం ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిగిలింది డివిజన్లు/వార్డులు, పురపాలికల పీఠాల వారీగా ఎస్టీ, ఎస్టీ మహిళ, ఎస్సీ, ఎస్సీ మహిళ, బీసీ, బీసీ మహిళ, అన్‌రిజర్వ్‌డ్‌, అన్‌రిజర్వ్‌డ్‌ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌కు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేలా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈనెల రెండో వారంలో పురపాలికల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పరిష్కారం చూపించలేదంటూ విమర్శలు..

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇంటి నంబర్ల ప్రకారం ఓటు హక్కు కల్పించలేదని.. ఇతర వార్డుల్లో ఓట్లు నమోదయ్యాయని.. వేరే జిల్లాలు, గ్రామాలు, ఇతర ప్రాంతాల ఓటర్లు తమ వార్డుల్లో నమోదైనట్లు వందలాది మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీనే తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా.. మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైనల్‌ ఓటర్ల జాబితాను వెల్లడించగా.. ఇందులోనూ పలు అభ్యంతరాలకు పరిష్కారం చూపలేదని రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌, అయిజ, పెబ్బేరు, అమరచింత, మద్దూరు పురపాలికల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదులు పరిష్కరించి.. తుది జాబితాను వెల్లడించినట్లు చెబుతున్నారు.

ఇతరులు

14

పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క

ఒక కార్పొరేషన్‌, 18 మున్సిపాలిటీల్లో వెల్లడి

జడ్చర్ల, అచ్చంపేటకు పూర్తి కాని పదవీ కాలం

ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లు 6,18,604 మంది

పలు మున్సిపాలిటీల్లో పరిష్కారం కాని అభ్యంతరాలు?

పురపాలికల వారీగా ఓటర్ల వివరాలు..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లు.. మరో 18 మున్సిపాలిటీల్లోని 316 వార్డుల పరిధిలో మొత్తం 903 పోలింగ్‌ స్టేషన్లను అధికారులు ఫైనల్‌ చేశారు. ఈ మేరకు పురుష ఓటర్లు 3,03,839 మంది, మహిళా ఓటర్లు 3,14,730 మంది, ఇతర ఓటర్లు 35 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 10,891 మంది అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement