దుస్తులు ఉతికేందుకు వెళ్లి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

దుస్తులు ఉతికేందుకు వెళ్లి మహిళ మృతి

Jan 12 2026 7:49 AM | Updated on Jan 12 2026 7:49 AM

దుస్త

దుస్తులు ఉతికేందుకు వెళ్లి మహిళ మృతి

నాగర్‌ కర్నూల్‌ క్రైం: దుస్తులు ఉతికేందుకు వెళ్లిన మహిళ చెరువులో పడి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. ఎస్‌ఐ గో వర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొట్ర శ్యామలమ్మ (55) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈమె శనివారం ఉదయం దుస్తులు ఉతికేందుకు స్థానికంగా ఉన్న కేసరి సముద్రం చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయింది. మృతదేహం ఆదివారం నీటిపై తేలియాడటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ప్రమాదవశాత్తు

వ్యక్తి దుర్మరణం

జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని నాగసాలకు చెందిన సాకలి వెంకటయ్య(55) ప్రమాదవశాత్తు మిషన్‌ భగీరథ గేటువాల్‌ నీటిగుంతలో జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కూలీ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నండగా దారిపక్కన మూత్ర విసర్జనకు వెళ్లి గేట్‌వాల్‌ గుంతలో పడిపోయాడు. గుంతలో నిల్వనీటిలో మునిగి మృతిచెందాడు. గేట్‌ మ్యాన్‌హోల్‌ తెరిచి ఉండడంతో గమనించలేక అందులో పడిపోయాడు. మ్యాన్‌హోల్‌పై బిగించిన మూత ఇటీవల ధ్వంసం కావడంతో తిరిగి మూతను బిగించలేదన్నారు. మృతుడికి భార్య సత్యమ్మ, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు.

ఉరేసుకొని

యువకుడి బలవన్మరణం

వీపనగండ్ల: మండలంలో ని బొల్లారం గ్రామానికి చెందిన గొల్ల నవీన్‌ (17) అనే యువకుడు శనివారం ఇంట్లో ఎవరు లేని సమ యంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రా మస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుందేళ్ల కుర్మయ్య, భాగ్యలక్ష్మి దంపతులు మూడో కుమారుడైన నవీన్‌ పొలం పనులు చేసుకుంటూ తల్లిదండ్రు లకు ఆసరాగా ఉండేవాడు. ఏమైందో ఏమో గానీ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నెమలిని

కాపాడిన రైతులు

పాన్‌గల్‌: పంట కాల్వలో చిక్కుకున్న నెమలిని రైతులు కాపాడి పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. వారి కథనం మేరకు.. మండలంలోని కొత్తపేట–మాందాపూర్‌ మధ్యన ఉన్న పంట కాల్వలో నెమలి చిక్కుకొని అస్వస్థతకు గురైంది. గుర్తించిన రైతులు దానిని బయటకుతీసి ప్రథమ చికిత్స నిర్వహించి పోలీసులకు అప్పగించారు. వారు అటవీ అధికారులకు అందజేయగా మాధవరావుపల్లి సమీపంలోని అడవుల్లో వదిలినట్లు చెప్పారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ యాదగిరి, ఫారెస్టు అధికారి గౌతమ్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

లారీ ఢీకొని డ్రైవర్‌ మృతి

కొత్తకోట రూరల్‌: డ్రైవర్‌ అజాగ్రత్తగా లారీని వెనకకు తీయడంతో మరో డ్రైవర్‌కు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అప్పరాల సమీపంలో గల కృష్ణవేణి షుగర్‌ ప్యాక్టరీ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్‌ నుంచి చెరుకు లోడ్‌తో ఖలీల్‌(45) లారీని కృష్ణవేణి షుగర్‌ ప్యాక్టరీకి తీసుకొచ్చా డు. ఈ క్రమంలో లారీ అన్‌లోడ్‌ చేసేందుకు ఆలస్యం కావడంతో భోజనం చేసేందుకు ప్యాక్టరీలోని క్యాంటీన్‌కు వెళ్తున్నాడు. అదే సమయంలో చెరుకును అన్‌లోడ్‌ చేసి బయటకు వెళ్తున్న మరో లారీని డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడుపుతూ ఖలీల్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో అక్కడే ఉన్న ఫ్యాక్టరీ సిబ్బంది క్షతగాత్రుడిని కొత్తకోటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఖలీల్‌ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఘటనపై తోటి లారీ డ్రైవర్లు ఖలీల్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

జడ్చర్ల: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు నిఘా వేసి పట్టుకున్న ఘటన శనివారం రాత్రి మండలంలోని లింగంపేట వద్ద చోటు చేసుకుంది. మండలంలోని లక్ష్మన్‌నాయక్‌ తండా నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించి బొలేరోలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో లింగంపేట వద్ద బొలేరోను స్వాధీనం చేసు కుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.డ్రైవర్‌ మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత సివిల్‌ సప్లయ్‌ అధికారులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు.

దుస్తులు ఉతికేందుకు  వెళ్లి మహిళ మృతి  
1
1/1

దుస్తులు ఉతికేందుకు వెళ్లి మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement