పుర ఎన్నికల్లో సత్తా చాటుదాం
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
నారాయణపేట: జిల్లాలోని మూడు నియోజకవర్గా ల్లో ఉన్న అన్ని పురపాలికల్లో అత్యధిక పార్టీ కౌ న్సిలర్లను గెలిపించి బీజేపీ జెండా ఎగరవేయాలని పాల మూరు ఎంపీ డీకే అరుణ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో పుర ఎన్నికల సన్నాహక సమావేశం పార్టీ జి ల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆయా పురపాలికల్లోని కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్లు, చైర్మన్లుగా గెలిపిస్తే అభివృద్ధికి అడుగులు పడతా యని చెప్పారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో జరిగి న కొన్ని పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. సమావేశంలో పురపాలక సంఘాల ఇన్‌చార్జ్‌లుగా కొత్తకాపు రతంగ్‌పాండు రెడ్డి, బలరామిరెడ్డి, భాస్కర్.. అమరచింత, ఆత్మకూర్‌కు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, మద్దూర్, కోస్గికి నా గులపల్లి ప్రతాప్‌రెడ్డి, కొడంగల్‌కు పున్నంచంద్ లా హోటిని నియమించారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది రఘువీర్‌యాదవ్, అదనపు న్యాయ వాది నందూనామాజీ, కృష్ణ చైతన్య, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి లక్ష్మి శ్యాంసుందర్‌గౌడ్, జిల్లా నాయకులు రఘురామయ్యగౌడ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ సత్య రఘుపాల్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్, మిర్చి వెంకటయ్య, వెంకట్రాములు, మదన్, కర్నె స్వామి, సుజాత, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ


