కుళ్లు తెగుళ్లు.. నివారిస్తే లాభాలు
అలంపూర్: ఈ ఏడాది వేరుశనగ సాగు కాస్త పెరిగింది. వానాకాలంలో అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రెండో పంటగా రబీలో అక్కడక్కడ వేరుశనగను సాగు చేశారు. అయితే పంటకు కాండం కుళ్లు తెగుళ్లు ఆశించే అవకాశం ఉండడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆస్పర్ జిల్లస్‌తో శిలీంధ్రంతో తెగుళ్లు
కాండం కుళ్లు ఆస్పర్ జిల్లస్ అనే శీలింధ్రం వలన పంటకు ఆశిస్తుంది. ఈ శీలింధ్రాలు మొక్క కణాలు, భూమిలో ఉండి పంటకు సోకి తెగుళ్లు వ్యాపింపజేస్తాయి. ఈ కణాలను కొనిడియా అని పిలుస్తారు. ఈ కొనిడియా గింజ నుంచి మొలక వచ్చిన వెంటనే భూమికి దగ్గరగా ఉండే కాండంకు ఆశిస్తుంది. తర్వాత కాండంపై నల్లటి రంగు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అక్కడ అంత తెల్లటి బూజు లాంటి పదార్థం తయారై మొక్క చనిపోతుంది.
మూడు దశల్లో తెగుళ్లు...
● గింజ భూమిలో ఉన్నప్పుడు తెగుళ్ల ఆశించే అవకాశం ఉంటుంది.
● మొక్క మొలకెత్తిన 20 నుంచి 25 రోజుల్లో తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది.
● మొక్క 60 నుంచి 65 రోజుల్లో ఉన్న సమయంలో ఈ తెగుళ్లు ఆశిస్తాయి.
నివారణ ఇలా..
కాండం తెగుళ్లు ఆశించిన పంటకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి, కార్బండిజమ్ అలాగే మాంకోజెబ్ గ్రాము లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిచేటట్లు వారానికి రెండు సార్లు పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పాడి–పంట
కుళ్లు తెగుళ్లు.. నివారిస్తే లాభాలు


