రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీవాసుల మృతి
భూత్పూర్: పట్టణంలోని జాతీయ రహదారి–44 బ్రిడ్జిపై ఆదివారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఏపీవాసులు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి భూత్పూర్ ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన మిలటరీ రిటై ర్డ్ అధికారి మేలుకోటి శేషయ్య(73), భార్య నవనీత(66)తో కలిసి హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు శేషాచలం, కుమార్తె వద్దకు వెళ్లి.. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఆదివారం వీరు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు కారులో వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేలుకోటి శేషయ్య, భార్య నవనీత అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ పూర్ణచంద్రరావుతోపాటు వెనుక నుంచి ఢీకొట్టిన కారులో ప్రయాణిస్తున్న అరుణ్‌కుమార్, చంద్రారెడ్డి, బీఎస్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
శేషయ్య (ఫైల్)


