నేడు కేటీఆర్ పర్యటన
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పాలమూరుకు రానున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుసభ్యులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఎంబీసీ గ్రౌండ్‌లో సన్మాన కార్యక్రమం, బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఆదివారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. మరోవైపు జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో గులాబీ తోరణాలతో అలంకరించి.. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారన్నది సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మ న్ యాదయ్య, నాయకులు శివరాజు, ప్రభాక ర్, మున్నూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
బాలికలనుఅన్నిరంగాల్లో తీర్చిదిద్దాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్‌ఐఈపీఏ– నీపా) ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతోపాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల వద్ద కంటే విద్యార్థినులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులు, వార్డెన్లతోనే గడుపుతారని వారి భవిష్యత్ కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థినులకు ఉత్తమ విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే గాక సత్ప్రవర్తనతో ఆదర్శంగా మెలగాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను కేజీబీవీలలో తప్పక అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీసీడీఓలు అర్షాఖాద్రీ, సంగీత, మాస్టర్ ట్రైనర్లు నాయుడు, పల్లవి, శివలీల, నర్మద తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి
దేవరకద్ర: దేవరకద్ర మున్సిపాలిటీకి నూతన భవనం మంజూరు చేయడంతోపాటు డ్రెయినేజీలు, సీసీరోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా మెరుగుపరచడానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శనివారం రాత్రి సీఎం నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడం వల్ల కార్యాలయం నిర్వహణ కోసం కొత్త భవనం అవసరం అని పేర్కొన్నారు. దీనికి గాను సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే చెప్పారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే
● బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ చైర్మన్ చిరంజీవులు
నేడు కేటీఆర్ పర్యటన
నేడు కేటీఆర్ పర్యటన
నేడు కేటీఆర్ పర్యటన


