‘మేయర్ గెలుచుకునేలా కష్టపడదాం’
స్టేషన్ మహబూబ్‌నగర్: కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్‌ను గెలుచుకునేలా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ముడా చైర్మన్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కా ర్పొరేషన్ ఎన్నికల్లో సర్వేల ప్రకారం టికెట్ కేటాయిస్తామని, పార్టీ జెండాలు మోసిన వారికి ప్రా ధాన్యత ఉంటుందన్నారు. టికెట్ల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. టికెట్ ఎంత మంది ఆశించినా ఒక్కరికే వస్తుంది కాబట్టి.. టికెట్ రానివారు నిరాశచెందకుండా అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలన్నారు. అత్యధికంగా కార్పొరేటర్ స్థానాలనుకైవసం చేసుకుందామన్నారు. ప్రతి డివిజన్‌లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామని సీఎంకు మాట ఇచ్చామని.. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. గడిచిన రెండేళ్లలో పట్టణంలో రూ.2 వేల కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని, సీఎంను ఒప్పించి మహబూబ్‌నగర్‌ను మున్సిప ల్ కార్పొరేషన్‌గా మంజూరు చేయించుకున్నామని గుర్తుచేశారు. సమావేశంలో టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు చంద్రకుమార్‌గౌడ్, జహీర్ అఖ్తర్, వినోద్‌కుమార్, ఎన్‌పీ వెంకటేశ్, ఎం.సురేందర్‌రెడ్డి, వసంత, బెనహర్, మధుసూదన్‌రెడ్డి, రాఘవేందర్‌రాజు, సుధాకర్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, అజ్మత్‌అలీ, షబ్బీర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


