ప్రకృతి ఒడి.. పరవశించే మది
ఆక్టోపస్ వ్యూపాయింట్
నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీశాఖ చేపట్టిన టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీలకు విశేష స్పందన లభిస్తోంది. సాధారణం కన్నా శని, ఆదివారాలతోపాటు సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో సుమారు 8 సార్లు పెద్ద పులి కనిపించడం విశేషం. జంగిల్ సఫారీలో నిత్యం పర్యాటకులకు పులులతోపాటు చిరుతలు, వన్యప్రాణులు తారసపడుతూ కనువిందు చేస్తున్నాయి. దీంతో అటవీశాఖ అమలుపరుస్తున్న టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ కోసం పెద్దసంఖ్యలో సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
రెండు రోజులపాటు..
పర్యాటక ప్రియులను ఆకర్షిస్తున్న నల్లమల టూరిజం
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఫర్హాబాద్, ఆక్టోపస్ వ్యూపాయింట్లు
జంగిల్ సఫారీలో పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల కనువిందు
వారాంతాలు, సెలవు రోజుల్లో విశేషంగా పెరుగుతున్న ఆదరణ
రెండు రకాల ప్యాకేజీల్లో అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ
సఫారీ టూర్ కోసం పర్యాటకులు (amrabadtigerreserve.com) వెబ్‌సైట్‌ను సందర్శించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
ప్రకృతి ఒడి.. పరవశించే మది
ప్రకృతి ఒడి.. పరవశించే మది


