సీఎంకురుణపడి ఉంటాం
గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నా. ప్రస్తుతం నిర్మాణానికి అడుగులు పడగా.. తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఏళ్లనాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– మహేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి (గద్వాల)
సందడిగా మారింది..
మా ఊరి మీదుగా ఆత్మకూర్, గద్వాలకు వాహనాలు తిరుగుతుంటే సందడిగా మారింది. గతంలో మా గ్రామంవైపు కన్నెత్తి చూడనివారు సైతం ఊరి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఊరి రూపురేఖలు మారడం ఖాయం.
– నర్సింహ, సర్పంచ్, జూరాల (ఆత్మకూర్)
రెండేళ్లలో నిర్మాణం పూర్తి..
కృష్ణానదిపై హైలేవల్ వంతెన నిర్మాణ పనులు రెండేళ్లలోపు పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా మొదట తాత్కాలిక రోడ్డు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీ పనులు వేగంగా కొనసాగిస్తోంది.
– దేశ్యానాయక్, ఈఈ, ఆర్‌అండ్‌బీ
●
సీఎంకురుణపడి ఉంటాం


