పుచ్చ సాగుకు సమయమిదే
కాయ కోత:
పక్వానికి వచ్చిన కాయలను సాయంత్రం వేళల్లో కోసి ఉదయం రవాణా చేయాలి. కాయలను తడితే డొల్ల శబ్దం వస్తే కాయ పక్వానికి వచ్చిందని గుర్తుంచుకోవాలి.
సస్యరక్షణ: పుచ్చ సాగుకు ప్రధానంగా తామర పురుగు ఆశించి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుంటాయి. దీన్ని నివారణకు పిప్రోనిల్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా ఆల్టర్నేరియా మచ్చతెగులు నివారణకు కార్బండిజమ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
అలంపూర్: వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో పుచ్చసాగు చేసుకునే అవకాశం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, కొద్దిపాటి మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. పుచ్చసాగుకు సంబంధించి రైతులకు పలు విషయాలను వివరించారు.
నేలలు.. వాతావరణం: పుచ్చకాయ పక్వానికి వచ్చినప్పుడు అధిక ఉష్ణోగ్రతలు ఉంటే మంచి రుచి, నాణ్యత వస్తోంది. 23 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన తేమ వాతావరణం అనుకూలం. మురుగునీరు ఇంకిపోయే వసతి గల ఇసుక, బంకమట్టి నేలలు పుచ్చకాయ పంటకు అనుకూలంగా ఉంటాయి. చౌడు, ఉప్పు నేలలు సాగుకు పనికిరావు.
రకాల ఎంపిక: అర్యజ్యోతి, అర్య మానిక్, షుగర్ బేబి, అపర్ణ, మధుబాల, మోహిన వంటి రకాలే కాకుండా ప్రైవేటు సంస్థల సంకర విత్తనాలను విత్తుకోవచ్చు.
ఎన్ని విత్తనాలు అవసరం: హైబ్రిడ్ విత్తనాలు అయితే ఎకరాకు 300 గ్రాములు, మేలు రకాలైతే ఎకరాకు 600 నుంచి 1000 గ్రాముల వరకు అవసరం ఉంటుంది. జనవరిలో ఈ పంట విత్తేందుకు అనుకూలం
నాటే విధానం: విత్తనం నాటే ముందు భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని భూ సారం మేరకు 8 నుంచి 10 అడుగుల దూరంలో 2 అడుగుల వెడల్పులో నీటి కాల్వలను తయారు చేయాలి. లోపలివైపు రెండు వైపులా రెండు అడుగుల దూరంలో విత్తనాలు వేసుకోవాలి.
విత్తే ముందు రోజు నీరు పెట్టాలి.
ఎరువుల యాజమాన్యం: విత్తనాలు వేయడానికి ముందు ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు లేదా టన్ను వానపాముల ఎరువులు, 150 కిలోల సూపర్, 40 కిలోల పొటాష్, 25 కిలోల యూరియా వేయాలి. 30 రోజుల తర్వాత పైపాటుగా 25 కిలోల యూరియా అందించాలి. పూత, పిందె సమయాల్లో 60 కిలోల కాల్షియం, అమ్మోనియం, సల్ఫేట్ మొక్క మొదలుకు ఇరువైపు గోతి తీసి ఎరువులు వేసి మట్టి కప్పాలి. తీగలు పాకే సమయంలో తల తుంచి సూక్ష్మ ధాతువులు మొక్కలకు అందేలా 4 గ్రాముల ఎఫ్–4 లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తీగలు సాగి నాణ్యమైన దిగుబడులు వస్తాయి.
నీటి యాజమాన్యం: పంట ప్రథమ దశలో వారం రోజుల వ్యవధిలో నీటితడి ఇవ్వాలి. తర్వాత వాతారణం, భూమి స్వభావం మేరకు 5 నుంచి 7 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. పూత వచ్చే సమయంలో నీరు ఆపి.. కొంచెం బెట్ట పరిస్థితులు కల్పించాలి. ఆ తర్వాత నీరు అందిస్తే పూత బాగా వచ్చి ఆడ పూల శాతం పెరుగుతుంది. కాయ ఎదిగేటప్పుడు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. కాయలు పక్వానికి వచ్చిన తర్వాత నీరు ఎక్కువగా ఇస్తే కాయలు పగిలే అవకాశం ఉంది.
పాడి–పంట
యాజమాన్య పద్ధతులు,
సస్యరక్షణ చర్యలతో నాణ్యమైన దిగుబడి


