మర్దాన్‌అలీషా దర్గా శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

మర్దాన్‌అలీషా దర్గా శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి

Jan 11 2026 9:39 AM | Updated on Jan 11 2026 9:54 AM

మర్దా

మర్దాన్‌అలీషా దర్గా శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రం షాసాబ్‌గుట్టలోని హజ్రత్‌ సయ్యద్‌ మర్దాన్‌ అలీషా రహెమతుల్లా అలై దర్గా శతాబ్ది ఉర్సు ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. శతాబ్ది ఉర్సును ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల తొలిరోజు దర్గాలో గుస్లే షరీఫ్‌ (జలాభిషేకం), 12న గంథోత్సవాన్ని షేక్‌ మొహియోద్దీన్‌ ఇంటినుంచి వన్‌టౌన్‌, న్యూటౌన్‌ల మీదుగా దర్గాకు తీసుకెళ్తారు. అనంతరం భక్తులనడుమ దర్గాలో పూలు, చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతేహాలు నిర్వహిస్తారు. 13వ తేదీన (చిరాగే) దీపారాధన, ఖవ్వాలి ఏర్పాటు చేయనున్నారు. 14వ తేదీన దర్గాలో ఖత్‌మే ఖురా నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఉత్సవాలను పురస్కరించుకొని దర్గా పీఠాధిపతి సయ్యద్‌ అబ్దుల్‌ రజాక్‌షాఖాద్రీ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

మహిళల అణచివేతకు

వ్యతిరేకంగా పోరాటం

పాలమూరు: సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, హింసలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు యు.సృజన అన్నారు. వందేళ్ల సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం జిల్లాకేంద్రంలోని సురవరం వెంకట్రామిరెడ్డి భవన్‌ వద్ద మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు బానిసత్వాన్ని తెంచి స్వేచ్ఛ, సమానత్వం సాధించిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని అన్నారు. మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో మహిళలు నిర్వహించినట్లు చెప్పారు. విదేశి విష సంస్కృతి మన దేశ సంస్కృతి సంప్రదాయాలను విధ్వంసం చేస్తున్నాయన్నారు. అందాల పోటీల పేరుతో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మహిళలు భారతదేశ సంప్రదాయాలను చాటుతూ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సీపీఐ సీనియర్‌ నాయకులు నరేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బాలకిషన్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం గొంతెత్తి నినాదిస్తుందని, మహిళ, విద్యార్థి, ఉద్యోగ, కార్మికుల పక్షాన ఉద్యమాలు చేసిన ఘనత సీపీఐకి దక్కుతుందన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహిస్తున్న సీపీఐ వందేళ్ల ముగింపు సభకు జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పద్మావతి, జిల్లా అద్యక్షురాలు భార్గవి, ఇందిర, శ్రీలత, పూజ, భవన, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సురేశ్‌, రాము పాల్గొన్నారు.

సమాజ సంఘటితం కోసం సత్సంగాలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: సమాజ సంఘటితం కోసం గ్రామస్థాయిలో సత్సంగాలు చేపట్టాలని విశ్వహిందూ పరిషత్‌ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ అన్నారు. జిల్లాకేంద్రంలో విశ్వహిందూ తెలంగాణ ప్రాంత సమావేశాలు శనివారం ప్రారంభయ్యాయి. సమావేశంలో ముఖ్యవక్తగా పాల్గొన్న కోటేశ్వరశర్మ మాట్లాడుతూ ప్రతి ప్రఖండ కేంద్రంగా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో విశ్వహిందూ పరిషత్‌ కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. దేవాలయాలపై జరుగుతున్న ఆకృత్యాలను ప్రతి కార్యకర్త ధైర్యంగా ఎదుర్కొనే స్థాయిని నేర్చుకోవాలన్నారు. ప్రతి దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని గోరక్ష కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పండుగలో మొట్టమొదటగా గోపూజ చేసుకునే సంప్రదాయాన్ని వీహెచ్‌పీ కార్యకర్తలు మొదలుపెట్టాలని కోరారు. సమావేశంలో వీహెచ్‌పీ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థానమలై, తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు నరసింహమూర్తి, కార్యదర్శి పరాయితం లక్ష్మినారాయణ, జిల్లా అధ్యక్షులు మద్ది యాదిరెడ్డితోపాటు ఆయా జిల్లాల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు, బజరంగ్‌దళ్‌, దుర్గావాహిని, మాతృశక్తి, సామాజిక సమరసత, ధర్మప్రసార సత్సంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి ఓపెన్‌ చెస్‌ పోటీలు

వనపర్తిటౌన్‌: ఉమ్మడి జిల్లాస్థాయి ఓపెన్‌ చెస్‌ పోటీలు సోమ, మంగళవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్విస్‌ లీగ్‌ పద్ధతిలో పోటీలు ఉంటాయని.. బాలికలు, బాలురు, సీ్త్రలు, పురుషులకు రెండు కేటగిరీల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లావాసులే అర్హులని.. ఆసక్తిగల వారు శనివారం సాయంత్రంలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు 99591 54743, 94913 76340సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వేణుగోపాల్‌, కోశాధికారి టీపీ కృష్ణయ్య, ప్రతినిధి ఎం.రాములు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు మార్షల్‌ ఆర్ట్స్‌లో రాణించాలి

జడ్చర్ల: విద్యార్థులు మార్షల్‌ ఆర్ట్స్‌లో రాణించాలని సినీ నటుడు సుమన్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని పోలేపల్లి గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులోని ఎస్‌వీకేఎం స్కూల్‌లో జరిగిన క్రీడా ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండర్‌– 14 విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, అండర్‌–17 విద్యార్థులకు వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌ తదితర పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బెల్టులు, షీల్డ్‌లు, ప్రశంస పత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్స్‌పాల్‌ ఎబినేజర్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మర్దాన్‌అలీషా దర్గా  శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి
1
1/4

మర్దాన్‌అలీషా దర్గా శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి

మర్దాన్‌అలీషా దర్గా  శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి
2
2/4

మర్దాన్‌అలీషా దర్గా శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి

మర్దాన్‌అలీషా దర్గా  శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి
3
3/4

మర్దాన్‌అలీషా దర్గా శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి

మర్దాన్‌అలీషా దర్గా  శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి
4
4/4

మర్దాన్‌అలీషా దర్గా శతాబ్ది ఉర్సుకు ఏర్పాట్లు పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement