ఇద్దరికి జైపాల్‌రెడ్డి స్మారక అవార్డు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అందించే స్మారక పురస్కారాలను ఈ సంవత్సరం కూడా ఇద్దరికి అందిస్తున్నట్లు న్యాయవాది మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవార్డులను పోతుల రాంరెడ్డి, గద్వాల చంద్రశేఖర్‌రెడ్డికి అందిస్తున్నట్లు తెలిపారు. వీరికి అవార్డుతోపాటు రూ.25వేల నగదు కూడా అందిస్తామన్నారు. ఇటువంటి వారిని ఎంపిక చేసి గౌరవించి సన్మానించడం చాలా గొప్ప విషయమని, ఇందుకు కారణమైన జేపీఎన్‌సీ చైర్మన్ రవికుమార్‌ను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. రవికుమార్ ఒక సాధారణ వ్యక్తిగా పెద్ద కళాశాల ప్రారంభించేందుకు సహరించిన జైపాల్‌రెడ్డిని గుర్తుంచుకుని ఆ స్మారక అవార్డులను ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఈనెల 12న సంక్రాంతి వేడుకలను జేపీఎన్‌సీ కళాశాలలో నిర్వహిస్తామని అక్కడ ఎంపిక చేసినవారికి అవార్డులను కూడా అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేపీఎన్‌సీ చైర్మన్ రవికుమార్, బాద్మిశివకుమార్, కార్యదర్శి వెంకటరామారావు, గిరిధర్‌రెడ్డి తదితరులు ఆపల్గొన్నారు.


