12న పాలమూరుకు కేటీఆర్
● పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లు,వార్డు సభ్యల సన్మాన కార్యక్రమం
● ఎంబీసీ మైదానంలో బహిరంగ సభ
● మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఈనెల 12వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను కేటీఆర్ సన్మానిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గా లు అసంతృప్తిలో ఉన్నాయని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికీ అండగా ఉంటామని చెప్పారు. మహబూబ్‌నగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సరిస్తామన్నారు. పురపాలిక ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇస్తామని చెప్పారు. మరో రెండేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం బహిరంగసభ జరిగే ఎంబీసీ మైదానంలో ఏర్పాట్లను వారు పరిశీలించారు. సభకు పెద్ద మొత్తంలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, నాయకులు రహమాన్, బాలరాజు, నరేందర్, కరుణాకర్‌గౌడ్, దేవేందర్‌రెడ్డి, గణేష్, కోట్ల నర్సింహ, కొండ లక్ష్మయ్య, శ్రీనివాస్, అనంతరెడ్డి, అన్వర్ పాష, వెదవత్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


