13న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
మహబూబ్‌నగర్ రూరల్: ఈనెల 13వ తేదీన జిల్లాలోని దివ్యాంగులు, వయో వృద్ధులకు ఉపకరణాల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి జరీనా బేగం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024 అక్టోబర్, 2025 జూన్‌లో హైదరాబా ద్‌కు చెందిన అలింకో సంస్థ జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు, వయో వృద్ద్ధులకు సులభంగా జీవించడానికి ఉపకరణాల కోసం అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇందులో అర్హత పొందిన దివ్యాంగులు, వయో వృద్ధులకు 13వ తేదీ ఉదయం 9.30 గంటలుకు జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డలోని స్టేట్ హోమ్‌లో ఉపకరణాలను అందజేస్తారని, అర్హులందరూ హాజరు కావాలని ఆమె సూచించారు.


