ఉత్తమ ఫలితాలు సాధించాలి: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ‘లక్ష్యసాధన–2026’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులు అన్ని విధాలా సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్రస్థాయిలో మహబూబ్‌నగర్ ఫస్ట్ ఉండేలా ముందుకు సాగాలన్నారు. కాగా, విద్యార్థులు లక్ష్యాన్ని ఎలా నిర్ధారించుకోవాలి, అనుసరించాల్సిన విధానాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ తదితర అంశాలపై మోటివేషనల్ స్పీకర్ షఫీ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రిషి విద్యాసంస్థల చైర్మన్ వెంకటయ్య, డైరెక్టర్లు ప్రవీణ్‌కుమార్, మోహన్‌రెడ్డి, కృష్ణ, శిరీష, పూజిత, సుశాంత్, ప్రిన్సిపాల్స్ వెంకటరమణ, సోమశేఖర్, ప్రసన్నకుమారి, జూనియర్ కళాశాల డీన్స్ భూపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కల్యాణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


