కందిలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
ఇటిక్యాల: కంది పంటకు వేరు కుళ్లు తెగులు ఆశించి మొక్కలు ఎండిపోతున్నాయని, రైతులు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. మండల కేంద్రంలో సాగు చేసి కంది పంట ఎండిపోతుండంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు వ్యవసాయాధికారులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేతల బృందంతో కలిసి మండల వ్యవసాయశాఖ అధికారి రవికుమార్‌తో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ కంది పంటకు వేరు కుళ్లు తెగులు కారణంగా పూత, కాయ దశలో మొక్క ఎండిపోవడం, వేర్లు సులువుగా విరిగేలా మారడం, వేర్లపై నల్లటి బొగ్గు లాంటి శిలీంధ్రపు పొడి కనిసిస్తుందన్నారు. ఎండలు, తేమ లోపం ఉన్నప్పుడు వ్యాధి తీవత్ర పంటలో ఎక్కువగా ఉంటుందన్నారు.


