ఆల్ఫ్రాజోలం తరలిస్తున్న వ్యక్తుల రిమాండ్
జడ్చర్ల: మండలంలోని నక్కలబండ తండా వద్ద గురువారం రాత్రి ఆల్ఫ్రాజోలం (మత్తు పదార్థం) తరలిస్తుండగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ విప్లవరెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు.. ఆల్ఫ్రాజోలం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నక్కలబండ తండా వద్ద నిఘా వేసి ఉంచిన సమయంలో కోయిల్‌కొండ మండలం పెద్దతండాకు చెందిన కొండ్యానాయక్ బైక్‌పై వెళ్తుండగా తాము తనిఖీ చేసిన సమయంలో అతడి వద్ద 240 గ్రాముల అల్ఫ్రాజోలం పట్టుబడింది. నిందితుడి నుంచి వచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లోని దమ్మాయిగూడెంలో రాంసాగర్, నాగరాజును అదుపులోకి తీసుకుని వారి నుంచి 85 గ్రాముల అల్ఫ్రాజలమ్‌ను స్వాధీనపర్చుకున్నారు. వీరు ఒక గ్రామును రూ.1000కి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరివద్ద నుంచి బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనపర్చుకుని నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎస్‌ఐలు నాగరాజు, కార్తీక్‌రెడ్డి ఉన్నారు.


